News June 28, 2024
నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ టెస్టు

దక్షిణాఫ్రికా, భారత మహిళా జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ నేడు మొదలవనుంది. చిదంబరం స్టేడియం వేదికగా 9.30amకి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 3వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన హర్మన్ సేన ఇప్పుడు టెస్ట్ సిరీస్‌పై కన్నేసింది. వన్డే సిరీస్‌లో సెంచరీలతో అదరగొట్టిన స్మృతి మంధానాపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. SAతో చివరిగా 2014లో భారత్ టెస్టు మ్యాచ్ గెలిచింది.
Similar News
News November 2, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవరించిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పింది. ఆ తర్వాత బలపడి బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఈ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు లేనట్లే తెలుస్తోంది. అటు ఏపీలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నట్లు తెలిపింది.
News November 2, 2025
జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!

AP: నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘జోగి రమేశ్ ప్రోద్బలంతోనే మద్యం తయారు చేశాం. వ్యాపారంలో నష్టపోయిన నాకు రూ.3కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టారు. ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారు’ అని రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
News November 2, 2025
అగ్హబ్ ఫౌండేషన్‌లో ఉద్యోగాలు

HYDలోని అగ్హబ్ ఫౌండేషన్ రూరల్ కోఆర్డినేటర్(2), కమ్యూనికేషన్ మేనేజర్(1) పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ(మార్కెటింగ్, జర్నలిజం& మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్), డిగ్రీ( అగ్రికల్చర్ అనుబంధ కోర్సులు) ఉత్తీర్ణులు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు NOV 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్సైట్: https://pjtau.edu.in/


