News June 28, 2024

నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ టెస్టు

image

దక్షిణాఫ్రికా, భారత మహిళా జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ నేడు మొదలవనుంది. చిదంబరం స్టేడియం వేదికగా 9.30amకి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 3వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన హర్మన్ సేన ఇప్పుడు టెస్ట్ సిరీస్‌పై కన్నేసింది. వన్డే సిరీస్‌లో సెంచరీలతో అదరగొట్టిన స్మృతి మంధానాపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. SAతో చివరిగా 2014లో భారత్ టెస్టు మ్యాచ్ గెలిచింది.

Similar News

News October 12, 2024

బాలకృష్ణ సరసన ఐశ్వర్యరాయ్?

image

నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన ఐశ్వర్యరాయ్ నటిస్తున్నట్లు టాక్. కాగా నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో బాలయ్య కూడా నటిస్తున్నారని, ఇందులోనే ఆయన సూపర్ హీరోగా కనిపిస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 12, 2024

భవిష్యత్తుకోసం బలమైన టీమ్‌ను నిర్మిస్తున్నాం: డెస్కాటే

image

వచ్చే రెండేళ్లలో బలమైన కోర్ టీమ్‌ను తయారుచేయాలనేదే తమ లక్ష్యమని టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే తెలిపారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ వంటి ఈవెంట్స్ ఉన్న నేపథ్యంలో ముందుగా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. నాణ్యమైన ఆటగాళ్లు చాలామంది ఉండటం భారత జట్టు అదృష్టమని పేర్కొన్నారు. 2 విభాగాల్లోనూ జట్టుకు ఉపయోగపడేవారికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు.