News December 8, 2024

2047 నాటికి 30 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్‌: ప్ర‌ధాన్

image

దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ పేర్కొన్నారు. జంషెడ్‌పూర్‌ XLRI మేనేజ్‌మెంట్ స్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్స‌వాల్లో ఆయ‌న మాట్లాడారు. $3 ట్రిలియన్ల పరిమాణంతో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందన్నారు. మరో 3 ఏళ్లలో $5 ట్రిలియన్‌లతో 3వ స్థానానికి చేరుతుందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా నిలుస్తుందన్నారు.

Similar News

News October 20, 2025

దేశంలో యూపీఐ ద్వారానే 85% డిజిటల్ చెల్లింపులు: RBI

image

ఇండియాలో 85శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో పేర్కొన్నారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయన్నారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని వివరించారు.

News October 20, 2025

దీపావళి: ఈ నియమాలు పాటిస్తున్నారా?

image

దీపావళి రోజున చేసే లక్ష్మీదేవి పూజలో ఇనుప వస్తువులు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది నెగటివ్ శక్తిని పెంచుతుందని అంటున్నారు. ‘నేడు ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఆడవారిని ఎట్టి పరిస్థితుల్లో బాధపెట్టకూడదు. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఇంట్లో బూజు దులపకూడదు. తులసి ఆకులు కోయకూడదు. ఇలా ఇస్తే.. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్తుంది’ అని చెబుతున్నారు.

News October 20, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. ఆర్జిత సేవలు రద్దు

image

AP: దీపావళి పండుగ వేళ తిరుమలలో రద్దీ నెలకొంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 84,017 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.97 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఇవాళ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు.