News November 30, 2024

పాకిస్థాన్ చేతిలో భారత్ U19 జట్టు ఓటమి

image

U19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమిపాలైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 రన్స్ చేసింది. 282 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత జట్టు 47.1 ఓవర్లలో 237 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ జట్టులో షాజైబ్ ఖాన్(159) సెంచరీతో రాణించారు. భారత జట్టులో నిఖిల్ కుమార్(67) ఫర్వాలేదనిపించినా మిగిలిన వారంతా విఫలమయ్యారు.

Similar News

News March 4, 2026

రేపే టెన్త్ హాల్ టికెట్ల విడుదల

image

TG: పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.bse.telangana.gov.in/ సైట్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేసినా హాల్ టికెట్ పొందవచ్చని తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

News March 4, 2026

ఇరాన్-US యుద్ధం.. కిమ్ జోంగ్‌పై పేలుతున్న మీమ్స్

image

ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌పై నెట్టింట మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. తరచూ అణు పరీక్షలతో కాలుదువ్వే ఆయనతో యుద్ధానికి ఎవరూ రావడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. తనను పట్టించుకోవడం లేదని కిమ్ బాధపడుతున్నట్లు, ఆయుధాలతో ఎదురు చూస్తున్నట్లు, ఎవరైనా అటాక్ చేశారా అని ఆకాశంలోకి చూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. కొన్ని మీమ్స్ పైన ఫొటోల్లో చూడొచ్చు.

News March 4, 2026

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ!

image

అమెరికా-ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తున్నా ఇరాన్ తగ్గట్లేదు. ఈ క్రమంలో ఖతర్‌లోని యూఎస్ స్పేస్ ఫోర్స్‌కు చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్‌ను ఇరాన్ డ్రోన్లతో నాశనం చేసింది. మొత్తంగా $1.1 బిలియన్లు నష్టం సంభవించినట్లు నిపుణుల అంచనా. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో మిస్సైల్స్ దాడులను గుర్తించే వ్యవస్థ దెబ్బతినిందని, US దళాలు కొంతకాలం బ్లైండ్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.