News September 2, 2024
హసీనాను అప్పగిస్తారో లేదో భారత్ ఇష్టం: బంగ్లా
మాజీ ప్రధాని షేక్ హసీనాను తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబెట్టేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ అన్నారు. ఆమెను అప్పగించాలా లేదా అన్నది భారత్ ఇష్టమని పేర్కొన్నారు. ‘మా న్యాయవ్యవస్థ కోరుకుంటే హసీనాను తప్పకుండా వెనక్కి రప్పిస్తాం. న్యాయ ప్రక్రియకు సంబంధించి భారత్‌తో బంగ్లాకు ఒప్పందం ఉంది. దీనిపై వదంతులు వ్యాప్తి చేయకపోవడమే మంచిది’ అని ఆయన వెల్లడించారు.
Similar News
News February 2, 2025
ఆ రోజు నుంచి నా టైమ్‌ను 8 నిమిషాలు ముందుకు జరిపా: సచిన్
16 ఏళ్ల వయసులో 1989లో తొలిసారి వెళ్లిన పాకిస్థాన్ టూర్ తనకు ఎంతో నేర్పిందని సచిన్ చెప్పారు. BCCI అవార్డుల వేడుకలో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్ కోసం రోజూ ఉ.9 గంటలకు హోటల్ నుంచి బస్సు వెళ్లేది. ఓ రోజు నేను ఆలస్యమవడంతో కపిల్ దేవ్ నన్ను పిలిచి ఇప్పుడు 9 అయిందా? అని అడిగారు. అప్పటి నుంచి నా వాచ్ టైమ్‌ను 7,8 నిమిషాలు ముందుకు జరిపా. ఆ పర్యటనతో నేనెంతో నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.
News February 2, 2025
RC16లో ఓ సీక్వెన్స్‌కు నెగటివ్ రీల్: రత్నవేలు
బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్, జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో ఓ సీక్వెన్స్‌లో సహజత్వం కోసం నెగటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా అంతా డిజిటల్ అయిందని, అయితే హాలీవుడ్‌లో నెగటివ్ వాడుతున్నారని చెప్పారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
News February 2, 2025
ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల పెనాల్టీ
రెగ్యులేటరీ నిబంధనలను పాటించని ఓ పైలట్‌ను విమానాన్ని నడిపేందుకు అనుమతించిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ కొరడా ఝళిపించింది. రూ.30 లక్షలు పెనాల్టీ విధించింది. గత ఏడాది జులై 7న ఆ పైలట్ నిబంధనలు ఉల్లంఘించి 3 విమానాలను టేకాఫ్, ల్యాండింగ్ చేశాడని పేర్కొంది. డిసెంబర్ 13న జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఫైన్ వేసినట్లు తెలిపింది.