News December 15, 2024

ఇవాళ భారత్-విండీస్ తొలి టీ20

image

WT20 WC తర్వాత భారత మహిళల జట్టు తొలి T20 సిరీస్‌‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి గేమ్‌లో తలపడనుంది. ముంబై వేదికగా రా.7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో 0-3తో ఘోరంగా ఓడిపోయిన భారత్ ఇందులోనైనా రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టాప్ ఆర్డర్‌లో ఓపెనర్ స్మృతి మంధాన మినహా మిగతావారు పెద్దగా పరుగులు చేయకపోతుండటం జట్టును కలవరపెడుతోంది.

Similar News

News January 16, 2025

BREAKING: సైఫ్ అలీఖాన్‌పై దాడి

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

News January 16, 2025

Stock Markets: భారీ గ్యాప్‌అప్ ఓపెనింగ్‌కు ఛాన్స్!

image

స్టాక్‌మార్కెట్లు నేడు భారీ లాభాల్లో మొదలవ్వొచ్చు. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండటమే ఇందుకు కారణం. గిఫ్ట్‌నిఫ్టీ ఏకంగా 146 పాయింట్ల లాభంతో చలిస్తుండటం గమనార్హం. ఆసియా సూచీలన్నీ గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. నిన్న US, EU స్టాక్స్ అదరగొట్టాయి. US ఇన్‌ఫ్లేషన్ తగ్గిందన్న వార్తలు పాజిటివ్ సెంటిమెంటు నింపుతున్నాయి. డాలర్, ట్రెజరీ, బాండ్ యీల్డుల విలువలు కాస్త కూల్‌ఆఫ్ అయ్యాయి.

News January 16, 2025

సెలవులు పొడిగించాలని వినతి

image

సంక్రాంతి సెలవుల తర్వాత తెలంగాణలో కాలేజీలు శుక్రవారం నుంచి, స్కూళ్లు శనివారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. అయితే తమ పిల్లలను ఆ రోజుల్లో పంపించబోమని, సోమవారం పంపుతామని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. శనివారం కూడా హాలిడే ఇవ్వాలని కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. మరి మీరెప్పుడు స్కూల్/కాలేజీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి.