News September 27, 2024

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి టెస్టు ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది. భారత్: రోహిత్ (C), జైస్వాల్, గిల్, కోహ్లీ, రిషభ్ పంత్(WK), KL రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్ దీప్, బుమ్రా, సిరాజ్. >బంగ్లా: ఇస్లాం, జకీర్ హసన్, శాంటో(సి), మోమినుల్ హక్, ముష్ఫికర్, షకీబ్, లిటన్, మిరాజ్, తైజుల్, మహమూద్, ఖలీద్.

Similar News

News October 10, 2024

దువ్వాడతో నాది పవిత్ర బంధం: మాధురి

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో తనది పవిత్ర బంధం అని దివ్వెల మాధురి చెప్పారు. ప్రజలు తమ మధ్య సంబంధాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్రజా జీవితం వేరు.. రాజకీయాలు వేరు. రెండింటికీ ముడి పెట్టొద్దు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ది తప్పు కాకపోతే మాదీ తప్పు కాదు. ఇక్కడ ఎవరూ రాముడిలాగా ఏకపత్నీవ్రతులు లేరు’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News October 10, 2024

మీకు తెలుసా.. ఈ జంతువులు సొంత పిల్లల్నే తినేస్తాయి!

image

జంతు ప్రపంచంలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని జంతువులు సొంత బిడ్డల్నే తినేస్తుంటాయి. తమకు పుట్టని పిల్లల్ని తినేసే మగసింహాలు, ఆహారం దొరక్క మాడిపోతున్న సమయంలో సొంత పిల్లల్ని తినేందుకు వెనుకాడవు. మొసళ్లు, మగ హిప్పోపొటమస్‌లు, చిట్టెలుకలు, ఆక్టోపస్‌లు, పీతలు, కొన్ని జాతుల పాములు కూడా కొన్నిసార్లు వాటి పిల్లల్ని అవే తినేస్తాయి. వినడానికి వింతగా ఉన్నా మనుగడ కోసం జంతు ప్రపంచంలో ఇది సహజమే.

News October 10, 2024

సెమీస్ రేసులోకి టీమ్ ఇండియా

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తు చేసి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కవిషా దిల్హారి (21), అనుష్క సంజీవని (20) కాసేపు పోరాడారు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, ఆశా శోభన చెరో 3 వికెట్లతో లంకేయుల భరతం పట్టారు.