News September 23, 2024

వాళ్లిద్దరూ లేకుండా భారత్‌లో టెస్టు మ్యాచ్ ఉండదు: అక్మల్

image

భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ లేకుండా భారత్‌‌ స్వదేశంలో టెస్టు ఆడటాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. ‘6 వికెట్లు, సెంచరీతో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశారు. జడ్డూ-అశ్విన్‌ది మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం. ఇక ఘోర ప్రమాదం తర్వాత పంత్ సైతం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులకు హ్యాట్సాఫ్’ అని కొనియాడారు.

Similar News

News September 23, 2024

‘దేవర’ టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి

image

తెలంగాణలో దేవర సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. SEP 27న రాష్ట్రంలోని 29 థియేటర్లలో రూ.100 పెంచి అర్ధరాత్రి ఒంటిగంటకు అదనపు షో వేసుకునేందుకు ఓకే చెప్పింది. అన్ని థియేటర్లలో తెల్లవారుజామున 4 గంటలకు రూ.100 పెంచి రోజుకు 6 షోలు వేసుకోవచ్చని తెలిపింది. ఇక సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.25, మల్టీప్లెక్సుల్లో రూ.50 హైక్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.

News September 23, 2024

ఆస్కార్‌-2025: ‘హనుమాన్’ జస్ట్ మిస్!

image

భారత్ నుంచి ఆస్కార్-2025కి ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ‘లాపతా లేడీస్’ను నామినేట్ చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ జాబితాలో 29 సినిమాలను FFI పరిశీలించింది. వీటిలో తెలుగు సినిమాలు హనుమాన్, కల్కి, మంగళవారం ఉన్నాయి. అత్యధికంగా హిందీ నుంచి 12, తమిళం నుంచి 6, మలయాళం నుంచి 4, మరాఠీ నుంచి 3, ఒడియా నుంచి ఒకటి ఉన్నాయి. అంతిమంగా ‘లాపతా లేడీస్’కే ఫెడరేషన్ ఓటేసింది.

News September 23, 2024

లౌకికవాదం భారత్‌కు అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

image

లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు ‘మోసం’ జరిగిందని త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ RN ర‌వి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. లౌకిక‌వాదం భారతదేశంలో అవసరం లేదన్నారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. లౌకికవాదాన్ని తప్పుగా అభివర్ణించడం వాటిలో ఒకటి. లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య ఘర్షణ వల్ల సెక్యులరిజం పుట్టింది’ అని ఆయన పేర్కొన్నారు.