News September 23, 2024
వాళ్లిద్దరూ లేకుండా భారత్‌లో టెస్టు మ్యాచ్ ఉండదు: అక్మల్
భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ లేకుండా భారత్ స్వదేశంలో టెస్టు ఆడటాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. ‘6 వికెట్లు, సెంచరీతో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశారు. జడ్డూ-అశ్విన్‌ది మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం. ఇక ఘోర ప్రమాదం తర్వాత పంత్ సైతం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులకు హ్యాట్సాఫ్’ అని కొనియాడారు.
Similar News
News October 15, 2024
మంత్రి నారాయణ 100 దరఖాస్తులు.. ఎన్ని గెలిచారంటే?
AP: తన గెలుపు కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తల కోసం మంత్రి నారాయణ రూ.2 కోట్లతో 100 వైన్ షాపులకు దరఖాస్తులు చేశారు. వీటిలో 3 దుకాణాలు దక్కగా, ఒక్కో షాపును ఐదుగురికి ఇచ్చేశారు. అలాగే విజయవాడకు చెందిన ఓ బార్ ఓనర్ ఏకంగా 480 దరఖాస్తులు వేయగా 11 షాపులు దక్కించుకున్నారు. ఇక పెనుగంచిప్రోలులోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసే రామకృష్ణ అనే వ్యక్తినీ అదృష్టం వరించింది. మొత్తం దుకాణాల్లో 10 శాతం మహిళలకే దక్కాయి.
News October 15, 2024
ABDUL KALAM: పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా
శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు నేడు. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఆయన జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన జన్మదినోత్సవాన్ని యూఎన్ఓ అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా వరించింది. కలాం ఎప్పుడూ చెప్పే ‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’ అనే సందేశం ప్రతి ఒక్కరిలో ఆలోచన రగిలిస్తుంది.
News October 15, 2024
ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా మెండిస్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నిలిచారు. సెప్టెంబర్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా ఈ ఏడాది ఆయన రెండు సార్లు ఈ పురస్కారం అందుకున్నారు. గతంలో టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్నారు. ఇప్పుడు మెండిస్ కూడా ఆయన సరసన చేరారు.