News May 19, 2024
22న ఇండియన్-2 ఫస్ట్ సింగిల్
శంకర్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్-2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సేనాపతి పునరాగమనానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా జులై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News December 11, 2024
నేటి నుంచి శివ దీక్షా విరమణ ప్రారంభం
AP: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీకమాస శివ దీక్షా విరమణ ప్రారంభం కానుంది. 15వ తేదీతో ముగిసే ఈ కార్యక్రమానికి పాతాళగంగా మార్గంలోని శిబిరాల్లో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చెప్పారు. గత నెల 2న మండల దీక్ష, 21న అర్ధమండల దీక్ష స్వీకరించిన భక్తులు విరమించవచ్చన్నారు. ఇవాళ ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులను చేసి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 11, 2024
బ్యాంకుల్లో మొండి బాకీలపై కేంద్ర మంత్రి ప్రకటన
ప్రభుత్వరంగ బ్యాంకులిచ్చిన రుణాల మొండి బాకీలు 3.09% ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. గత సెప్టెంబర్ 30 నుంచి బ్యాంకులు మంజూరు చేసిన దాని విలువ రూ.3.16లక్షల కోట్లు అని రాజ్యసభలో వెల్లడించారు. అటు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.1.34లక్షల కోట్లు ఉన్నట్లు తెలిపారు. అది 1.86%కి సమానమన్నారు. ప్రభుత్వ రంగం(3.09%)తో పోలిస్తే ఇది తక్కువ అని స్పష్టం చేశారు.
News December 11, 2024
3వ టెస్టులో ఆకాశ్ దీప్‌ను ఆడించాలి: సంజయ్ మంజ్రేకర్
BGT 3వ టెస్టులో హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్‌ను ఆడించాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. బ్రిస్బేన్ పిచ్ కండిషన్లు అతని బౌలింగ్ శైలికి సరిపోతాయన్నారు. 2వ టెస్టులో రాణా రన్స్ ఇచ్చారనే కారణమే కాకుండా పిచ్ పేస్‌కు అనుకూలిస్తుందనుకుంటే ఆకాశ్‌ను ఆడించే ఆలోచన చేయాలన్నారు. అడిలైడ్ మాదిరి బ్రిస్బేన్ పిచ్ కూడా ఫ్లాట్‌గా ఉంటే బుమ్రా, సిరాజ్, రాణా లేదా ఆకాశ్ బౌలింగ్ ఎటాక్ సరిపోదని చెప్పారు.