News May 5, 2024
‘ఇండియన్-2’ సినిమా విడుదల వాయిదా?
కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఇండియన్-2’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. జూన్‌లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీని జులై 11 లేదా 17న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Similar News
News December 28, 2024
పంత్ ఈసారి ఫెయిల్!
ఆస్ట్రేలియా గడ్డపై సూపర్ రికార్డు ఉన్న రిషభ్ పంత్ ఈసారి విఫలం అవుతున్నారు. BGT 2024-25లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. మొదటి టెస్టులో 38, రెండో టెస్టులో 49, మూడో టెస్టులో 9, నాలుగో టెస్టు (ఫస్ట్ ఇన్నింగ్స్)లో 28 పరుగులు మాత్రమే చేశారు. పంత్ బలహీనతలపై ఆస్ట్రేలియా బౌలర్లు ఫోకస్ చేసి ఔట్ చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
News December 28, 2024
మెగా డీఎస్సీ ఆలస్యం.. నిరుద్యోగుల అసంతృప్తి
AP: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడటంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు 3 నెలల గడువు ఉంది. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు కనీసం 3-4 నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త టీచర్లకు శిక్షణ, పోస్టింగ్ మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
News December 28, 2024
న్యూ ఇయర్.. మందుబాబులకు శుభవార్త
TG: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని సూచించింది.