News February 20, 2025

విజృంభిస్తున్న భారత బౌలర్లు.. బంగ్లా 5 వికెట్లు డౌన్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. 8.3 ఓవర్లలో 5 కీలక వికెట్లు తీసి బంగ్లా నడ్డి విరిచారు. ఓపెనర్ సర్కార్, కెప్టెన్ శాంటో, రహీమ్ డకౌట్ అయ్యారు. హసన్ మిరాజ్ (5), టాంజిద్ (25) పరుగులు చేశారు. ప్రస్తుతం 9 ఓవర్లలో బంగ్లా స్కోరు 36/5గా ఉంది. భారత బౌలర్లలో షమీ, అక్షర్ 2వికెట్లు తీయగా, హర్షిత్ ఒక వికెట్ పడగొట్టారు.

Similar News

News February 20, 2026

16 శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే..

image

సంతోషీ మాత వ్రతాన్నే ‘16 శుక్రవారాల వ్రతం’ అంటారు. ఈ వ్రతం చేస్తే అద్భుత మార్పులుంటాయని నమ్మకం. ‘మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి, ధనప్రాప్తి కలుగుతుంది. వివాహం యోగం లేనివారికి మంచి ఫలితాలుంటాయి. దంపతుల మధ్య కలహాలు తొలగి అన్యోన్యత పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యాలు దూరమవుతాయి. ఇల్లు సుఖసంతోషాలతో, ధనదాన్యాలతో విరాజిల్లుతుంది’ అని పండితులు చెబుతున్నారు.

News February 20, 2026

పుచ్చ పంటలో పండు ఈగను ఎలా నివారించాలి?

image

పుచ్చ పంటలో పండు ఈగ తల్లి పురుగులు పూమొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలిచి లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. కాయలు వంకర్లు తిరిగి కుళ్లిపోతాయి. వీటి నివారణకు క్యూల్యూర్ అనే పండు ఈగ ఆకర్షణ బుట్టలు ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పంటకాలం మొత్తం అమర్చుకోవాలి. తీవ్రతను బట్టి లీటరు నీటికి మలాథియాన్ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News February 20, 2026

BECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం గలవారు మార్చి 5 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/అసెస్‌మెంట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.24,356 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295, SC, ST, PwBDలకు ఫీజులేదు. సైట్: www.becil.com