News February 20, 2025

విజృంభిస్తున్న భారత బౌలర్లు.. బంగ్లా 5 వికెట్లు డౌన్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. 8.3 ఓవర్లలో 5 కీలక వికెట్లు తీసి బంగ్లా నడ్డి విరిచారు. ఓపెనర్ సర్కార్, కెప్టెన్ శాంటో, రహీమ్ డకౌట్ అయ్యారు. హసన్ మిరాజ్ (5), టాంజిద్ (25) పరుగులు చేశారు. ప్రస్తుతం 9 ఓవర్లలో బంగ్లా స్కోరు 36/5గా ఉంది. భారత బౌలర్లలో షమీ, అక్షర్ 2వికెట్లు తీయగా, హర్షిత్ ఒక వికెట్ పడగొట్టారు.

Similar News

News March 26, 2025

మధ్యాహ్నం బయటకు రాకండి.. ప్రభుత్వం సూచన

image

TGలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణాలు చేసే సమయాల్లో నీరు, ORS వెంట ఉంచుకోవాలని, దాహం లేకున్నా నీటిని తాగాలని సూచించింది. వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని, కళ్లజోడు, క్యాప్ పెట్టుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలంది. మ.12-3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లొద్దని పేర్కొంది.

News March 26, 2025

IPL: ఢిల్లీకి గుడ్ న్యూస్!

image

భార్య అతియా శెట్టి డెలివరీ కారణంగా IPLలో తొలి మ్యాచుకు దూరమైన ఢిల్లీ ప్లేయర్ కేఎల్ రాహుల్ రెండో మ్యాచుకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం వైజాగ్‌లో SRHతో జరిగే మ్యాచులో ఆయన ఆడతారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌కు బలం చేకూరనుంది. అంతకుముందు లక్నోతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో ఢిల్లీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News March 26, 2025

ఉపాధి హామీ కూలీలుగా షమీ సోదరి, బావ: జాతీయ మీడియాలో కథనాలు

image

భారత్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ సోదరి, బావ.. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదైనట్లు నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2021 నుంచి 2024 వరకు ఆ మేరకు వేతనాలు కూడా తీసుకున్నట్లు తెలిపాయి. అయితే ఈ ఆరోపణలపై షమీ కుటుంబం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇటీవల CT ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమీ తల్లి, సోదరి భారత క్రికెట్ జట్టుతో మైదానంలో కనిపించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!