News July 19, 2024
భారత్ మిరపకాయ.. స్పైసీ చిప్స్ తిని ఆస్పత్రిపాలైన జపాన్ విద్యార్థులు

జపాన్లో ఓ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు స్పైసీ పొటాటో చిప్స్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటిని భారత్లో దొరికే భూట్ జోలోకియా అనే మిరపకాయతో తయారు చేస్తారు. అస్సాం, నాగాలాండ్, మణిపుర్లో లభించే ఈ మిర్చికి హాటెస్ట్ చిల్లీగా గిన్నిస్ రికార్డ్ ఉంది. ఈ చిప్స్ని 18 ఏళ్లలోపు వారు తినకూడదనే హెచ్చరిక ఉన్నప్పటికీ విద్యార్థులు తినడంతో మంటను తట్టుకోలేపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
Similar News
News November 20, 2025
KTRకు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి

TG: మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఛార్జ్షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలో KTRపై అభియోగాలు నమోదు చేయనుంది. కాగా కొన్నిరోజుల క్రితం విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్ ఉన్నారు.
News November 20, 2025
చలికి తట్టుకోలేకపోతున్నా దుప్పటి ఇప్పించండి: నటుడు

రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరులోని పరప్పన జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ చలికి తట్టుకోలేక జడ్జి ముందు వాపోయారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన ఆయన.. “చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనీసం అదనపు దుప్పటి ఇప్పించండి” అని కోరారు. మరో నిందితుడు నాగరాజు కూడా అదే విధంగా అభ్యర్థించాడు. జైలు అధికారుల తీరుపై జడ్జి మండిపడ్డారు. వెంటనే కంబళి ఇవ్వాలని ఆదేశించారు. విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేశారు.
News November 20, 2025
అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది వీరే..

దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వారి జాబితాలో పవన్ కుమార్ చామ్లింగ్(సిక్కిం-24 ఏళ్లు) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నవీన్ పట్నాయక్(ఒడిశా-24 ఏళ్లు), జ్యోతి బసు(పశ్చిమబెంగాల్-23 ఏళ్లు), గెగాంగ్ అపాంగ్(అరుణాచల్ ప్రదేశ్-22 ఏళ్లు), లాల్ థన్హవ్లా(మిజోరం-22 ఏళ్లు), వీరభద్ర సింగ్(హిమాచల్ ప్రదేశ్-21 ఏళ్లు), మాణిక్ సర్కార్(త్రిపుర-19 ఏళ్లు), నితీశ్ (బిహార్-19 ఏళ్లు) ఉన్నారు.


