News July 19, 2024
భారత్ మిరపకాయ.. స్పైసీ చిప్స్ తిని ఆస్పత్రిపాలైన జపాన్ విద్యార్థులు

జపాన్‌లో ఓ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు స్పైసీ పొటాటో చిప్స్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటిని భారత్‌లో దొరికే భూట్ జోలోకియా అనే మిరపకాయతో తయారు చేస్తారు. అస్సాం, నాగాలాండ్, మణిపుర్‌లో లభించే ఈ మిర్చికి హాటెస్ట్ చిల్లీగా గిన్నిస్ రికార్డ్ ఉంది. ఈ చిప్స్‌ని 18 ఏళ్లలోపు వారు తినకూడదనే హెచ్చరిక ఉన్నప్పటికీ విద్యార్థులు తినడంతో మంటను తట్టుకోలేపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
Similar News
News July 9, 2025
షాకింగ్.. పిల్లలకు లెక్కలు రావట్లేదు!

దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు(గణితం) రావట్లేదని కేంద్రం సర్వేలో తేలింది. మూడో తరగతి పిల్లల్లో 45% మంది ఆరోహణ, అవరోహణ క్రమాన్ని గుర్తించలేకపోతున్నారని పేర్కొంది. ఆరో తరగతిలో 10 వరకు ఎక్కాలు(టేబుల్స్) వచ్చిన వారు 53% శాతమే. తొమ్మిదిలో గణితంపై అవగాహన ఉన్నవారు ఇంతే శాతమని తెలిపింది. దీని ప్రకారం విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
News July 9, 2025
పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్: రోజా

AP Dy.CM పవన్ కళ్యాణ్ ఓ డ్రామా ఆర్టిస్ట్ అని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో EVM ప్రభుత్వం నడుస్తోందని ఆమె మండిపడ్డారు. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఒక EVM CM. APలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా EVMను ఆరు నెలలు భద్రపరుస్తారు. కానీ APలో మాత్రం 10 రోజులకే నాశనం చేయాలంటూ జీవో జారీ చేస్తారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
News July 9, 2025
ప్రేయసి IPS అవ్వాలని ప్రియుడు ఏం చేశాడంటే?

ఢిల్లీకి చెందిన రాహుల్.. హరిద్వార్ నుంచి 121 లీటర్ల గంగాజలాన్ని కావడిలో మోసుకెళ్తూ రౌత్-ముజఫర్ నగర్ కావడి మార్గంలో కనిపించాడు. ఈ మార్గంలో శివ భక్తులు గంగా జలాన్ని తీసుకెళ్తుంటారు. అయితే, అందరిలా కాకుండా ఇతడు మాత్రం తన ప్రేయసి కోసం కావడి మోశారు. తాను ఇంటర్ పాసయ్యానని, ప్రేయసి IPS అయ్యేవరకూ ఇలా నీరు తెచ్చి దేవుడికి సమర్పిస్తూనే ఉంటానని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.