News September 17, 2024
న్యూయార్క్‌లో ఆలయం ధ్వంసం.. ఖండించిన భారత కాన్సులేట్
న్యూయార్క్‌లోని స్వామినారాయణ్ ఆలయంలో ఓ భాగాన్ని దుండగులు <<14119738>>ధ్వంసం<<>> చేయడాన్ని అక్కడి భారత కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. ఇది హేయమైన చర్య అని మండిపడింది. నిందితులను అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను కోరింది. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. ఇటీవల హిందూ సంఘాలకు బెదిరింపులు వచ్చాయని, ఇప్పుడు దాడి జరిగిందని పేర్కొంది.
Similar News
News October 9, 2024
నిరుద్యోగులతో సర్కార్ చెలగాటం: షర్మిల
AP: నాలుగు నెలలుగాAPPSCకి ఛైర్మన్‌ను నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని PCC చీఫ్ YS షర్మిల మండిపడ్డారు. ఏపీపీఎస్సీపై నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ‘శ్వేతపత్రాలపై పెట్టిన శ్రద్ధ, ఏపీపీఎస్సీపై కూడా పెట్టాలి. తక్షణమే దానికి ఛైర్మన్‌ను నియమించాలి. వాయిదా వేసిన పరీక్షలతో పాటు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా షెడ్యూల్ ప్రకటించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
News October 9, 2024
BJPలో చేరిన ఇద్దరు ఇండిపెండెంట్ MLAలు
హరియాణాలో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు BJPలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేశ్ జూన్ కమలం గూటికి చేరుకున్నారు. వీరి చేరికతో బీజేపీ ఎమ్మెల్యేల బలం 50కి చేరుకుంది. మరోవైపు భారత సంపన్న మహిళ, హిసార్ ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ కూడా బీజేపీకి మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
News October 9, 2024
గ్రూప్-1 మెయిన్స్‌పై కీలక అప్‌డేట్
TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.