News May 11, 2024
పవన్ కళ్యాణ్‌కు భారత క్రికెటర్ మద్దతు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భారత క్రికెటర్ హనుమా విహారి మద్దతు ప్రకటించారు. ‘ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి’ అని పిఠాపురం ప్రజలను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. విహారి నిన్న కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పవన్‌కు మద్దతుగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు పిఠాపురం వెళ్లారు.
Similar News
News December 28, 2024
నేడు మన్మోహన్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ఇవాళ ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. తొలుత మన్మోహన్ పార్థీవ దేహాన్ని ఆయన నివాసం నుంచి AICC కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి నిగమ్‌బోధ్ ఘాట్‌కు తీసుకెళ్తారు.
News December 28, 2024
రెండు పార్టులుగా VD12 మూవీ: నాగవంశీ
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 మూవీ రెండు పార్ట్‌లుగా రాబోతోందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. అయితే రెండు పార్టుల్లో వేర్వేరుగా కథ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తొలి భాగం 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందన్నారు. మార్చిలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ హరిహరవీరమల్లు రిలీజ్ ఉంటే వాయిదా వేస్తామని చెప్పారు.
News December 28, 2024
TG టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు
JAN 2 నుంచి 20 వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఉ.9 నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అభ్యర్థులను గంటన్నర ముందే పరీక్ష కేంద్రంలో అనుమతిస్తారు. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను క్లోజ్ చేస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.