News June 20, 2024

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గుతున్నాయ్

image

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించినట్లు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ డేటా వెల్లడించింది. 2021లో 3.88 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లుగా ఉన్న మొత్తం 1.04B Sfr(₹9,771 కోట్లు)కు తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా బ్లాక్ మనీగా భావించలేమంది. అక్కడ విదేశీ డిపాజిట్లలో IND స్థానం 67కు చేరినట్లు వివరించింది. తొలి 3 స్థానాల్లో బ్రిటన్(254B Sfr), US(71B Sfr), ఫ్రాన్స్(67B Sfr) ఉన్నాయి.

Similar News

News September 15, 2024

వారికి కోరుకున్న చోట స్థలాలిస్తాం: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములిచ్చిన రైతుల నుంచి స్వయంగా అంగీకార పత్రాలు తీసుకున్నారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వచ్చి భూములు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలిస్తామని తెలిపారు. ఐఐటీ రిపోర్ట్ ఆధారంగా రాజధాని నిర్మాణ పనులు చేపడతామన్నారు.

News September 15, 2024

రేవంత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు: హరీశ్

image

TG: అరెకపూడి గాంధీ కాంగ్రెస్ MLA అని CM రేవంత్ ఇవాళ తన వ్యాఖ్యలతో ఒప్పుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘మనోళ్లే వాళ్లింటికి వెళ్లి తన్నారని రేవంత్ అన్నారు. అంటే గాంధీ వాళ్లోడే అన్నట్టుగా. సీఎం మాటలు చూస్తుంటే తానే దాడి చేయించానని చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. మళ్లీ పైనుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.

News September 15, 2024

నిఫా వైరస్‌తో కేరళలో వ్యక్తి మృతి

image

నిఫా వైరస్ కారణంగా కేరళలో ఓ వ్యక్తి మరణించారు. మళప్పురం జిల్లాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆ వ్యక్తి సెప్టెంబర్ 9వ తేదీన మృతి చెందినట్లు పేర్కొన్నారు. మరణం తర్వాత పరీక్షల్లో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. మృతుడితో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లని గుర్తించి అనుమానిత లక్షణాలు ఉన్న ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు.