News September 15, 2024
భారత దిగ్గజాలు ఇండియాను పాక్‌కు పంపండి.. ప్లీజ్: మోయిన్
పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్‌ను పంపేలా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్, ద్రవిడ్, గంగూలీ బీసీసీఐతో మాట్లాడాలని పాక్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ‘క్రికెట్ ఆగకూడదు. ఇరు దేశాలు ఆడటమనేది పాక్‌తో పాటు మొత్తం క్రికెట్‌కు మంచిది. ఇండియా రాకపోతే పాక్ కూడా భారత్‌లో పర్యటించకూడదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 15, 2024
వ్యాయామం ఎంతసేపు చేయాలంటే?
ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. కానీ రోజుకు ఎంత సేపు చేయాలి, ఎలా చేయాలనే దానిపై కొందరికి అవగాహన ఉండదు. వారంలో 5 రోజులపాటు గంట చొప్పున ఎక్సర్‌సైజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు అదుపులో పెట్టుకుని వ్యాయామం చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యి బరువు తగ్గుతారు. అలాగే నడక కూడా మన ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోజూ వీలైనంత దూరం నడక కొనసాగించాలి.
News October 15, 2024
RED ALERT: ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారత వాతావరణ విభాగం (IMD) నేడు ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News October 15, 2024
నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం
TG: తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు హాలిడేస్ ఇచ్చారు. 13 రోజుల పాటు సెలవులు కొనసాగాయి. ఇక జూనియర్ కాలేజీలు నిన్నటి నుంచి పున:ప్రారంభమయ్యాయి.