News February 4, 2025
US నుంచి స్వదేశానికి భారతీయ వలసదారులు

వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులను ట్రంప్ తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు వచ్చేసింది. భారత్‌కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో US మిలిటరీ విమానం టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుంచి ఇండియాకు బయలుదేరింది. కాగా అక్కడ 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు భారత్, US గుర్తించాయని ఇటీవల బ్లూమ్‌బెర్గ్ న్యూస్ పేర్కొంది.
Similar News
News February 15, 2025
ఆ రోజు నుంచి మలయాళ సినీ ఇండస్ట్రీ క్లోజ్?

మలయాళ సినిమా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి పరిశ్రమను మూసివేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అధిక పన్నులు, నటీనటులు రెమ్యునరేషన్ పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ & స్క్రీనింగ్‌లతో సహా అన్ని చలనచిత్ర కార్యకలాపాలను నిలిపివేస్తామని వెల్లడించారు.
News February 15, 2025
మోదీని నేను అగౌరవపర్చలేదు: సీఎం రేవంత్

TG: ప్రధాని <<15461493>>మోదీ కులంపై<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పందించారు. మోదీని తాను వ్యక్తిగతంగా అగౌరవపర్చలేదని, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానన్నారు. అందుకే ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని మాట్లాడానని తెలిపారు. తన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని మండిపడ్డారు. మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.
News February 15, 2025
22 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 48ఏళ్ల నటుడు

బాలీవుడ్ నటుడు, యూట్యూబర్ సాహిల్ ఖాన్ 48 ఏళ్ల వయసులో వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలైన 22 ఏళ్ల మిలేనా అలెగ్జాండ్రాను వివాహమాడారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో వీరిద్దరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సాహిల్ గతంలో నార్వేజియన్ నటి నెగర్ ఖాన్‌ను వివాహం చేసుకోగా రెండేళ్లకే విడిపోయారు.