News May 23, 2024
ఎల్లుండి అమెరికాకు భారత ఆటగాళ్లు?

టీ20 వరల్డ్ కప్ కోసం ఈ నెల 25న టీమ్ఇండియా ప్లేయర్లు, సిబ్బంది అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జట్లలోని ఆటగాళ్లు యూఎస్ విమానం ఎక్కనున్నట్లు సమాచారం. మొదట రోహిత్, కోహ్లీ, హార్దిక్, బుమ్రా, సూర్య, పంత్, అక్షర్, అర్ష్దీప్, కుల్దీప్, సిరాజ్ వెళ్లనుండగా.. ఐపీఎల్ ఫైనల్ తర్వాత మిగతా ప్లేయర్స్ అక్కడికి చేరుకోనున్నారట. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.
Similar News
News November 8, 2025
నెలకు రూ.10 లక్షలు కావాలా?.. షమీ మాజీ భార్యపై ఫైర్

తనకు నెలకు రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, రూ.10 లక్షలు కావాలని షమీ మాజీ భార్య జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత మళ్లీ మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకని, సొంతకాళ్లపై నిలబడటం రాదా అని ప్రశ్నిస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల ఖర్చు ప్రకారం ఉండాలని, ఆదాయం ఆధారంగా కాదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 8, 2025
బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోండి!

రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. 2026 నుంచి కొనుగోలు చేసే టూవీలర్లకు ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండాల్సి ఉంటుంది. అలాగే డీలర్లు వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 2 BIS సర్టిఫైడ్ హెల్మెట్స్ అందించాలి. రైడర్ & పిలియన్ హెల్మెట్ ధరించాలి. లేకపోతే రూ.వేలల్లో ఫైన్స్ విధించొచ్చు.
News November 8, 2025
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ఒకటే ఈ కర్పూరం నూనె. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.


