News January 31, 2025

అమెరికాలో ఆర్థిక ఇబ్బందుల్లో భారత విద్యార్థులు

image

ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టిన భారత విద్యార్థులు ఆర్థికంగా కటకటలాడుతున్నారు. అక్కడ ఉండే భారీ ఫీజులు, ఖర్చుల్ని తట్టుకునేందుకు, ఇక్కడ చేసిన అప్పుల్ని తీర్చేందుకు భారీగా పార్ట్‌ టైమ్ జాబ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు క్యాంపస్ బయట చేసే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలపై ట్రంప్ సర్కారు నిఘా వేయడంతో అవి మానేయక తప్పని పరిస్థితి. దీంతో డబ్బు కోసం పేరెంట్స్‌పైనే విద్యార్థులు ఆధారపడుతున్నారు.

Similar News

News October 29, 2025

గాజాపై దాడులు.. 60 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

News October 29, 2025

కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

image

అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది. కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.యల్‌ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలి.

News October 29, 2025

తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000

image

AP: తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక <<18137630>>సాయం<<>> ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.1000 అందజేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3000 అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు.