News January 31, 2025
అమెరికాలో ఆర్థిక ఇబ్బందుల్లో భారత విద్యార్థులు

ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టిన భారత విద్యార్థులు ఆర్థికంగా కటకటలాడుతున్నారు. అక్కడ ఉండే భారీ ఫీజులు, ఖర్చుల్ని తట్టుకునేందుకు, ఇక్కడ చేసిన అప్పుల్ని తీర్చేందుకు భారీగా పార్ట్ టైమ్ జాబ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు క్యాంపస్ బయట చేసే పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై ట్రంప్ సర్కారు నిఘా వేయడంతో అవి మానేయక తప్పని పరిస్థితి. దీంతో డబ్బు కోసం పేరెంట్స్‌పైనే విద్యార్థులు ఆధారపడుతున్నారు.
Similar News
News February 15, 2025
రెండోసారి తల్లి కాబోతున్న హీరోయిన్ ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు. తాజాగా విడుదల చేసిన ఇన్‌స్టా రీల్‌లో ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించడంతో పాటు మిడ్‌నైట్ స్నాక్స్ ఫొటోలను పంచుకుంది. ‘నువ్వు గర్భవతివని నాకు చెప్పకుండా గర్భవతివని చెప్పు’ అని రాసుకొచ్చింది. కాగా మైఖేల్ డోలన్‌ను పెళ్లాడిన ఇలియానాకు 2023 ఆగష్టులో కోవా ఫోనిక్స్ డోలన్ అనే బాబు పుట్టాడు.
News February 15, 2025
అప్పట్లో..! టీచర్ అంటే సర్ కాదు!!

స్కూల్ డేస్‌లో టీచర్, సర్ తేడాలు గుర్తున్నాయా. అప్పట్లో టీచర్ అంటే ఉపాధ్యాయురాలు. సర్ అంటే ఉపాధ్యాయుడు. పొరపాటున ఎవరైనా సర్‌ని టీచర్ అంటే ఆయన టీచర్ కాదు సర్ అని చెప్పి అంతా నవ్వడం, ఆ తర్వాత ఏడిపించడం సాధారణంగా జరిగేవి. ఇప్పుడు కొంచెం జెండర్ డిఫరెన్స్ క్లారిటీ వచ్చేలా మేడమ్, సర్ అంటున్నారు.
Ex: మీకు ఇంగ్లిష్ సబ్జెక్ట్ మేడమ్ చెబుతారా? సర్ చెబుతారా?
మీకూ ఈ టీచర్, సర్ అనుభవం ఉందా? కామెంట్ చేయండి.
News February 15, 2025
అమ్మడు లైనప్ అదిరిందిగా!

‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ బ్యూటీ నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రేజ్‌తో వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేశారు. రామ్ పోతినేని సరసన RAPO22, దుల్కర్ సల్మాన్ ‘కాంత’లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో ఆమె కనిపిస్తారని సమాచారం. దీంతో ఈ అమ్మడి లైనప్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.