News June 18, 2024

వచ్చే వారం జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

image

జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం జట్టును అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. కాగా జింబాబ్వేతో భారత్ 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ హరారేలో జరగనున్నాయి. జులై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. 6న తొలి టీ20, 7న రెండో, 10న మూడో, 13న నాలుగో, 14న చివరి మ్యాచ్ జరగనుంది.

Similar News

News December 6, 2025

TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

image

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.

News December 6, 2025

విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

image

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.

News December 6, 2025

ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్‌కు రావాలని ఆదేశం

image

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.