News June 18, 2024

వచ్చే వారం జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

image

జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం జట్టును అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. కాగా జింబాబ్వేతో భారత్ 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ హరారేలో జరగనున్నాయి. జులై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. 6న తొలి టీ20, 7న రెండో, 10న మూడో, 13న నాలుగో, 14న చివరి మ్యాచ్ జరగనుంది.

Similar News

News October 8, 2024

తిరుమలలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్: సత్యకుమార్

image

AP: రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలు బలోపేతం చేసేందుకే రూ.88 కోట్ల ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మరోవైపు రూ.20 కోట్ల వ్యయంతో తిరుమల, కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లు కూడా నెలకొల్పుతామని చెప్పారు.

News October 8, 2024

OFFICIAL: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఎవ‌రికి ఎన్ని సీట్లు?

image

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఓట్ల లెక్కింపు ముగిసింది. ప‌దేళ్ల త‌రువాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌-కాంగ్రెస్-సీపీఎం కూట‌మి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్సీ 42, కాంగ్రెస్ 6, సీపీఎం 1 స్థానంలో గెలుపొందాయి. 90 స్థానాలున్న అసెంబ్లీలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను కూటమి పార్టీలు చేరుకున్నాయి. ఇక BJP 29 స్థానాల్లో, పీడీపీ 3, జేపీసీ, ఆప్ చెరో స్థానంలో గెలుపొందాయి.

News October 8, 2024

నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు: నాగార్జున లాయర్

image

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్, పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఇవాళ నాగార్జునతో పాటు మొదటి సాక్షిగా సుప్రియ వాంగ్మూలం రికార్డు చేశారని, ఈనెల 10న మరో సాక్షి వాంగ్మూలం తీసుకుంటారని చెప్పారు. నేరం రుజువైతే సురేఖపై కోర్టు చర్యలు తీసుకుంటుందని, ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.