News December 24, 2024
WU-19 వరల్డ్ కప్‌నకు భారత జట్టిదే..

జనవరి 18 నుంచి జరగనున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌నకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖకు చెందిన షబ్నమ్ చోటు దక్కించుకున్నారు.
జట్టు: నికీ ప్రసాద్(కెప్టెన్), సానికా చాల్కే(వైస్ కెప్టెన్), త్రిష, కమలిని, భావిక, ఈశ్వరి, మిథిల, జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, ధృతి, ఆయూషి, ఆనందిత, షబ్నమ్, వైష్ణవి
Similar News
News October 22, 2025
BPT-2848 వరి పోషకాలను ఇలా అందించాలని ప్లాన్

బ్లాక్, రెడ్ రైస్ ధాన్యం పైపొరలో యాంతోసైనిన్ అనే పదార్థం వల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ పొరలో జింక్, ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. BPT-2848లో ఈ పోషకాల శాతం చాలా ఎక్కువ. అందుకే ఈ రైస్ పౌడర్‌ను పిల్లలకు బేబీ ఫుడ్‌లా అందించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఉప్మారవ్వ, పౌడర్, జావ, పాయసం, కేకులు, అటుకులు, వడియాలు, సేమియా రూపంలోనూ ఈ రకాన్ని అందించాలని బాపట్ల వరి పరిశోధనాస్థానం ఇప్పటికే నిర్ణయించింది.
News October 22, 2025
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ 16 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ( కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 10 పోస్టులకు అప్లైకి ఈ నెల 24 ఆఖరు తేదీ కాగా.. 6 పోస్టులకు ఈ నెల 28 లాస్ట్ డేట్. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://dic.gov.in/
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43

1. జనకుని తమ్ముడి పేరు ఏంటి?
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ఎవరు?
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం ఏది?
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ఏమిటి?
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ఏమంటారు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>