News December 24, 2024

WU-19 వరల్డ్ కప్‌నకు భారత జట్టిదే..

image

జనవరి 18 నుంచి జరగనున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌నకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖకు చెందిన షబ్నమ్ చోటు దక్కించుకున్నారు.
జట్టు: నికీ ప్రసాద్(కెప్టెన్), సానికా చాల్కే(వైస్ కెప్టెన్), త్రిష, కమలిని, భావిక, ఈశ్వరి, మిథిల, జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, ధృతి, ఆయూషి, ఆనందిత, షబ్నమ్, వైష్ణవి

Similar News

News January 15, 2025

GOOD NEWS: IBPS జాబ్ క్యాలెండర్ విడుదల

image

బ్యాంకు ఉద్యోగార్థులకు IBPS గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. RRBలో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలకు సంబంధించిన జాబితా ఇందులో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇతర పూర్తి వివరాల కోసం <>https://www.ibps.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

News January 15, 2025

బ్యాక్ టు హైదరాబాద్

image

సంక్రాంతి పండగ ముగియడంతో ప్రజలు మహానగర బాట పట్టారు. గత 3-4 రోజులుగా స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన వారంతా తిరుగుపయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రేపటి నుంచి ట్రాఫిక్ మరింత పెరగనుంది. అటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

News January 15, 2025

గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్?

image

AP: ఆన్‌లైన్ పైరసీ, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బందులు పడుతున్న గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో ఆ చిత్రం స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీప్లేస్ చేస్తున్నట్లు సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. వెంకీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను దిల్ రాజు నిర్మించారు.