News June 2, 2024
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత జట్టు ఓటమి
ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఓటమి చవి చూసింది. లండన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఆతిథ్య బ్రిటన్ జట్టు పైచేయి సాధించింది. 3-1 తేడాతో ఇండియాపై విజయం సాధించింది. బ్రిటన్ జట్టు విజయంలో నికోలస్, కల్నన్ విల్‌లు కీలక పాత్ర పోషించారు. టీమిండియాలో స్టార్ ప్లేయర్లంతా విఫలమవగా అభిషేక్ ఏకైక గోల్ చేశారు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ 2019 నుంచి ఈ లీగ్ నిర్వహిస్తోంది.
Similar News
News September 19, 2024
మళ్లీ తుఫాను ముప్పు.. అతిభారీ వర్షాలకు ఛాన్స్
AP: ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉ.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు.
News September 19, 2024
సంచలనాల అఫ్గాన్: INDపై మినహా అన్ని టెస్టు జట్లపై విజయం
కొన్నేళ్లుగా అగ్రశ్రేణి జట్లను మట్టికరిపిస్తూ అఫ్గాన్ సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న SAపై తొలిసారి వన్డే మ్యాచ్‌లో గెలిచింది. దీంతో భారత్‌పై మినహా టెస్టు క్రికెట్ ఆడే అన్ని జట్లపై విజయాన్ని(టెస్ట్/ODI/T20) సొంతం చేసుకుంది. AUS, NZ, PAK, WI, SL, ZIM, ఐర్లాండ్, BANలపై T20లలో, BAN, ENG, ఐర్లాండ్, PAK, SA, SL, WI, ZIMపై ODIల్లో, బంగ్లా, ఐర్లాండ్, జింబాబ్వేపై టెస్టుల్లో గెలిచింది.
News September 19, 2024
పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్.. మేఘాకు కాంట్రాక్ట్
AP: పోలవరం ప్రాజెక్టులో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలని నిన్న క్యాబినెట్ నిర్ణయించింది. మొత్తం 63,656 చ.మీ. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ పనులను మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించింది. కొత్తగా టెండర్లు పిలిస్తే ఏడాది సమయం పడుతుందని.. మేఘాకు ఇవ్వడం వల్ల ఈ నవంబర్ నుంచే పనులు ప్రారంభించవచ్చని మంత్రిమండలి అభిప్రాయపడింది.