News July 17, 2024
శ్రీలంక సిరీస్కు భారత జట్టు ఎంపిక వాయిదా?

శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత ఇవాళ జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ జట్టు ఎంపికను సెలక్షన్ కమిటీ వాయిదా వేసినట్లు సమాచారం. టీ20 కెప్టెన్సీ విషయంలో కోచ్, సెలక్టర్లు, బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నట్లు టాక్. హార్దిక్, సూర్యలలో ఎవరిని సారథిగా నియమించాలనేదానిపై ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తోంది.
Similar News
News December 4, 2025
HYD: వరంగల్ రూట్లో బ్లాక్ స్పాట్స్ ఇవే!

ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ ఇంజినీర్ల బృందం గుర్తించింది. ముఖ్యంగా CPRI క్రాస్, ఘట్కేసర్ బైపాస్ జంక్షన్ ముందు 500 మీ.వద్ద పలు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఉన్న రహదారి సైతం బ్లాక్ స్పాట్ ప్రాంతంగా జాతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గుర్తించినట్లుగా తెలిపింది.
News December 4, 2025
పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు

TG: భూకబ్జా కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీపై గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదైంది. వట్టినాగులపల్లిలో 70 మంది బౌన్సర్లతో వచ్చి ల్యాండ్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారని, అడ్డుకున్న తమపై దాడి చేశారంటూ పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు FIR ఫైల్ చేశారు. NOV 30న ఘటన జరగగా రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు మరో ఐదుగురిపై తాజాగా కేసు నమోదైంది.
News December 4, 2025
ఈ బౌలింగ్, ఫీల్డింగ్తో వరల్డ్ కప్ నెగ్గగలమా?

వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే జట్టు అన్ని విభాగాల్లో టాప్ క్లాస్లో ఉండాలి. ప్రస్తుతం IND బౌలింగ్, ఫీల్డింగ్ చూస్తే WC గెలవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. SAతో 2వ వన్డేలో 350+స్కోర్ చేసినా బౌలర్లు పోరాడలేదు. తొలి వన్డేలోనూ తేలిపోయారు. ఫీల్డింగ్లోనూ లోపాలు కనిపించాయి. WC-2027కు ముందు భారత్ 20 వన్డేలే ఆడనుంది. అప్పట్లోగా ఈ 2 విభాగాల్లో మెరుగవ్వకుంటే WC మరోసారి కలగానే మిగిలే ప్రమాదం ఉంది.


