News July 29, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తాను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఆడబోనని వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ ఈవెంట్స్ ఓపెనింగ్ రౌండ్‌లోనే బోపన్న-బాలాజీ జోడీ ఓడిన విషయం తెలిసిందే. కాగా బెంగళూరుకు చెందిన బోపన్న అత్యంత పెద్ద వయసు(43)లో డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించారు. అర్జున, పద్మశ్రీ వంటి పురస్కారాలూ అందుకున్నారు.
Similar News
News February 1, 2025
వాట్సాప్ డీపీలతో జాగ్రత్త! నమ్మితే అంతే..
HYDకు చెందిన మహిళకు కొత్త నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. డీపీగా కజిన్ ఫొటో ఉండటంతో అతడే అని భావించి మాట్లాడింది. అవతలి వ్యక్తి కజిన్ పేరు చెప్పి, పరిచయస్థుడిలా మాట్లాడాడు. అర్జెంటుగా ఇండియాలో ఉన్న వ్యక్తికి డబ్బులు పంపాలని, రేపటికల్లా ఇచ్చేస్తానని నమ్మించాడు. ఆమె రూ.2 లక్షలు పంపింది. మళ్లీ డబ్బులు అడగ్గా అనుమానం వచ్చి కజిన్‌కు ఫోన్ చేసింది. మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.
News February 1, 2025
ట్రంప్‌పై దర్యాప్తు చేసినవారి మెడపై సస్పెన్షన్ కత్తి
US అధ్యక్షుడు ట్రంప్‌పై క్రిమినల్ నేరాల దర్యాప్తులో పాల్గొన్న FBI అధికారుల మెడపై సస్పెన్షన్ కత్తి వేలాడుతోంది. పదుల కొద్దీ సంఖ్యలో అధికారులను వ్యవస్థ నుంచి తప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయంపై ఓ కథనాన్ని ప్రచురించింది. అధికారులతో పాటు 30మంది ఫెడరల్ ప్రాసిక్యూటర్స్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని పేర్కొంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాల్ని డెమొక్రాట్లు ఖండిస్తున్నారు.
News February 1, 2025
కాసేపట్లో మంత్రులతో CM అత్యవసర భేటీ
TG: సీఎం రేవంత్ కాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలతో పాటు ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారులెవరూ ఈ మీటింగ్‌కు రావొద్దని ఆదేశించినట్లు సమాచారం.