News February 1, 2025
ట్రంప్‌పై దర్యాప్తు చేసినవారి మెడపై సస్పెన్షన్ కత్తి

US అధ్యక్షుడు ట్రంప్‌పై క్రిమినల్ నేరాల దర్యాప్తులో పాల్గొన్న FBI అధికారుల మెడపై సస్పెన్షన్ కత్తి వేలాడుతోంది. పదుల కొద్దీ సంఖ్యలో అధికారులను వ్యవస్థ నుంచి తప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయంపై ఓ కథనాన్ని ప్రచురించింది. అధికారులతో పాటు 30మంది ఫెడరల్ ప్రాసిక్యూటర్స్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని పేర్కొంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాల్ని డెమొక్రాట్లు ఖండిస్తున్నారు.
Similar News
News February 18, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ బౌలర్ దూరం

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ జట్టుకు కీలక బౌలర్ దూరమయ్యారు. కుడి పాదానికి గాయం కారణంగా లోకి ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. అతడి స్థానంలో జెమిసన్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌కు స్టార్ బౌలర్లు దూరమైన సంగతి తెలిసిందే. కీలక బౌలర్లు దూరమవడంతో బ్యాటర్లకు ఈ టోర్నీ పండగే కానుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
News February 18, 2025
తారకరత్న వర్ధంతి వేళ భార్య ఎమోషనల్ పోస్ట్

నందమూరి తారకరత్న వర్ధంతి వేళ ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. ‘విధి వక్రించి మిమ్మల్ని మా నుంచి దూరం చేసింది, నువ్వులేని లోటు లోకంలో ఏది పూరించలేదు. మీ జ్ఞాపకాలు మా చుట్టూనే తిరుగుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తారకరత్న ఫొటో ముందు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.
News February 18, 2025
కేసు వాదిస్తుండగా గుండెపోటుతో లాయర్ మృతి

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది పసునూరు వేణుగోపాల రావు మరణించారు. ఓ కేసులో వాదనలు వినిపిస్తూ కోర్టు హాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. లాయర్ మృతితో మిగతా కోర్టు హాళ్లలో రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.