News December 19, 2024

భారతీయ మహిళలు ‘బంగారం’

image

బంగారం అంటే మహిళలకు ఎంతో ప్రీతి. ఒంటిపై నగ ఉండాలనే కోరిక వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారం కొనడంలో ముందుంటారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో 11శాతం భారతీయ మహిళలే కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. వీరి వద్ద 24వేల టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచంలోని బంగారు నిల్వల్లో US, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యాల సంయుక్త నిల్వలను అధిగమించింది.

Similar News

News January 24, 2025

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సీపీ కీలక వ్యాఖ్యలు

image

TG: మీర్‌పేట్‌లో భార్యను <<15227723>>దారుణంగా హత్య చేసిన ఘటన<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇది మిస్సింగ్ కేసుగానే ఉందని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులతోనూ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News January 24, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై హైకోర్టులో పిల్!

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సినిమా బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు. అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఐటీ, ఈడీ, జీఎస్టీ అధికారులతో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

News January 24, 2025

VIRAL: విపరీతమైన చలి.. ఏనుగులకు స్వెటర్లు

image

చలి విపరీతంగా పెరిగిపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పొగ మంచు కప్పేస్తోంది. దీంతో మూగ జీవాలు సైతం వణికిపోతున్నాయి. ఈక్రమంలో ప్రతి ఏటా మథురలోని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ రెస్క్యూ చేసిన ఏనుగులకు స్వెటర్లు వేస్తుంటుంది. బ్లాంకెట్స్ & మహిళలు నేసిన ఊలు స్వెటర్లు ధరించడంతో ఏనుగులు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.