News April 8, 2025

భారతీయులు గొప్ప ప్రతిభావంతులు: బిల్ గేట్స్

image

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఇండియన్స్ గురించి మాట్లాడారు. ‘భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సమస్యల్ని సులభంగా పరిష్కరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. డిజిటల్ రంగంలోనూ ఇండియా శరవేగంగా దూసుకెళ్తోంది. భారత్‌లోని పేదలు కూడా చాలా తెలివైన వారు కానీ అవకాశాల్లేక వెనుకబడుతున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 23, 2025

పాకిస్థాన్‌కు భారత్ దెబ్బ?

image

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ, దౌత్యపరంగా పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా స్థావరాలపై దాడి
*ఆ దేశంతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం
*సింధు నదీజలాల ఒప్పందం రద్దు
*ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర గురించి భారత్ UN సెక్యూరిటీ ప్రతినిధులకు, 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టే యోచన.

News April 23, 2025

కొత్త పెన్షన్లు.. అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం

image

TG: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు.

News April 23, 2025

ఫెయిలై ఒకరు.. తక్కువ మార్కులొచ్చాయని మరొకరు సూసైడ్

image

AP: ఇద్దరు టెన్త్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కృష్ణా(D) అర్జువానిగూడెంకు చెందిన G.అనిల్ గతేడాది, ప్రస్తుతం సైన్స్ పరీక్షలో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని చనిపోయాడు. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతానికి చెందిన G.వేణుగోపాలరావుకు ఇవాళ టెన్త్ ఫలితాల్లో 393 మార్కులొచ్చాయి. తక్కువ మార్కులొచ్చాయని ఉరేసుకొని మృతిచెందగా, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!