News May 26, 2024
ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు: భట్టి

ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశానికి మేలు జరుగుతుందని తెలంగాణ డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పార్టీ తరఫున పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. తాము అధికారంలోకి రాగానే ఆయా రంగాల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను AUG 15లోపు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను చూసి BJP భయపడుతోందని, అందుకే తమ నేతలపై మోదీ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
Similar News
News February 20, 2025
నేడే టీమ్ ఇండియా తొలి సమరం

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నేడు తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌పై ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపులో ఉన్న భారత్‌కు బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టం కాకపోవచ్చు. విరాట్, రోహిత్ ఫామ్‌లో ఉన్నారు. అయితే బుమ్రా లేని బౌలింగ్ దళం ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. అటువైపున్నది బంగ్లాయే అయినా తక్కువ అంచనా వేయొద్దని, నిర్దయగా ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలుకానుంది.
News February 20, 2025
‘శంభాజీ’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

‘ఛావా’లో శంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టిన సన్నివేశం చరిత్రలో జరగలేదంటూ నటి స్వరభాస్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదువుకున్నాను. సినిమాలో చూపించిన హింసలో ఏమాత్రం కల్పితం లేదు’ అని ఒకరు పేర్కొనగా.. ‘శంభాజీ త్యాగాన్ని చులకన చేయడానికి నీకెంత ధైర్యం’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.
News February 20, 2025
మహా కుంభమేళాను వాడుతున్న సినీ మేకర్స్

మహా కుంభమేళా సినీజనానికి మంచి అవకాశంగా మారింది. ఇప్పటికే బాలయ్య ‘అఖండ-2’కి కొంత షూటింగ్‌ను కుంభమేళాలో తీసినట్లు సమాచారం. తాజాగా తమన్నా నాగ సాధువుగా నటిస్తున్న ‘ఓదెల-2’ ప్రమోషన్లకి కూడా కుంభమేళా వేదికగా మారింది. మూవీ టీజర్‌ను ఈ నెల 22న అక్కడే లాంఛ్ చేయనున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అటు భక్తితో పాటు ఇటు సినిమా పనిని కూడా మూవీ టీమ్స్ చక్కదిద్దుకుంటున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.