News January 1, 2025

భారత్‌కు పెరిగిన సముద్ర తీరం.. కారణమిదే

image

భారత సముద్ర తీరం 48శాతం మేర పెరిగిందని కేంద్ర హోం శాఖ తాజా నివేదికలో తెలిపింది. 1970 డేటా ప్రకారం తీరం పొడవు 7516 కి.మీ ఉంది. కానీ నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ తాజా విధానాల ప్రకారం ఈసారి వంపుల్ని కూడా లెక్కించారు. దీంతో పొడవు 11,098.81 కి.మీగా అయింది. AP కోస్టల్ ఏరియా పొడవు గతంలో 973.70 కి.మీ ఉండగా అది ఇప్పుడు 1053.07కి చేరింది. అత్యధికంగా గుజరాత్‌కు 92.69శాతం మేర తీరం పొడవు కొత్తగా కలిసింది.

Similar News

News January 4, 2025

మాల్దీవుల ప్రగతికి అండగా ఉంటాం: జైశంకర్

image

మాల్దీవుల ప్రగతికి, సుస్థిరతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్‌ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఆయన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని జైశంకర్ పేర్కొన్నారు. అటు.. భారత్‌తో బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు ఖలీల్ ట్వీట్ చేశారు.

News January 4, 2025

వినియోగదారులకు EPFO గుడ్ న్యూస్

image

పింఛనుదారులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకునుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 68 లక్షలమంది లబ్ధిదారులు ఈ చర్యతో మేలు పొందుతారని పేర్కొంది. ఇప్పటి వరకూ EPFO కేవలం కొన్ని బ్యాంకులతోనే అగ్రిమెంట్ ఉన్న కారణంగా పింఛనుదారులు ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ భారం తప్పనుంది. ఈ నెల 1 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.

News January 4, 2025

కోన్స్టస్ అందుకే బుమ్రాను రెచ్చగొట్టారేమో: పంత్

image

సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆఖరి ఓవర్లో భారత కెప్టెన్ బుమ్రాకు, ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్‌స్టాస్‌కు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దానిపై రిషభ్ పంత్ స్పందించారు. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు సమయం వృథా చేయాలనుకున్నారు. అందుకే కావాలని బుమ్రాను కోన్‌స్టార్ రెచ్చగొట్టారని అనుకుంటున్నా. అయితే, వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో నాకు వినిపించలేదు’ అని పేర్కొన్నారు.