News July 29, 2024
చైనాతో భారత్ పోటీ.. సవాళ్లపై నారాయణ మూర్తి కామెంట్స్!
తయారీ రంగంలో చైనా చాలా ముందుందని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఆ దేశంతో పోటీ పడేందుకు భారత్ ముందున్న సవాళ్లపై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మాన్యుఫ్యాక్చరింగ్ వృద్ధికి దేశంలో మెరుగైన ప్రభుత్వ పాలన, మద్దతు అవసరమని నొక్కి చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారిందని, దాదాపు 90% వస్తువులు అక్కడే తయారు చేస్తున్నట్లు తెలిపారు. అందుకే దాని GDP భారత్ కంటే 6 రెట్లు ఎక్కువ ఉందని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2024
మగ బిడ్డకు జన్మనిచ్చిన రేణుకాస్వామి భార్య
కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకాస్వామి భార్య సహన మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. హీరోయిన్ పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపారని రేణుకాస్వామిని దర్శన్ అనుచరులు చిత్రహింసలకు గురిచేసి చంపారనే ఆరోపణలు దక్షిణాదిలో సంచలనం సృష్టించాయి. కాగా రేణుకా స్వామి మరణించిన సమయంలో సహన 5 నెలల గర్భిణి.
News October 16, 2024
ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
దాదాపు రెండేళ్లుగా ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఎట్టకేలకు వీరి సినిమాలు రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ (JAN 10), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ‘పుష్ప-2’ (DEC 6) సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సాంగ్స్, టీజర్స్ విడుదలయ్యాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.
News October 16, 2024
సింగిల్ టేక్‌లో 11 నిమిషాల సీన్: వరుణ్ ధవన్
వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని 11 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో చేసినట్లు వరుణ్ వెల్లడించారు. ఇది సిరీస్ క్లైమాక్స్‌లో రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.