News November 15, 2024

భారత ఆర్థిక వ్యవస్థ భేష్: మూడీస్

image

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మూడీస్ సంస్థ ప్రశంసించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.2 వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2025లో 6.6 శాతం, 2026లో 6.5శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. ఆర్థికంగా దేశం చక్కటి దశలో ఉందని అభిప్రాయపడింది. అయితే, ప్రపంచ రాజకీయ పరిస్థితులు, వాతావరణ ఇబ్బందులు వెరసి మాంద్యం భయాల కారణంగా RBI కఠినతరమైన విధానాల్నే కొనసాగించొచ్చని అంచనా వేసింది.

Similar News

News November 15, 2024

నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే..

image

కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. రోజుకోసారైనా రుచి చూడాలని తహతహలాడుతుంటారు. కానీ నెలరోజులపాటు మాంసాహారం తినడం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నెలపాటు మానేస్తే అజీర్ణం, జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య తగ్గి, ఎముకల బలం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఆర్థరైటిస్, వాపులు, నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.

News November 15, 2024

US డోజ్ నుంచి జాబ్ నోటిఫికేషన్

image

యూఎస్ డోజ్ (DOGE) జాబ్ అప్లికేష‌న్ల‌ను ఆహ్వానించింది. అమెరికా ఫెడ‌ర‌ల్ ప‌రిపాల‌నా వ్యవహారాలను చక్క‌దిద్ద‌డం స‌హా అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించేలా నిత్యం వ్యూహాల‌ను ప్ర‌తిపాదించే స‌మ‌ర్థుల కోసం వెతుకుతోంది. సూప‌ర్ IQ ఉన్న వ్య‌క్తులు వారంలో 80 గంట‌ల‌కుపైగా ప‌నిచేయగలిగిన వారు త‌మ CVల‌ను పంపాల‌ని కోరింది. వీరిలో టాప్ 1% అభ్యర్థులను మ‌స్క్‌, వివేక్ రామ‌స్వామి రివ్యూ చేసి ఎంపిక చేస్తార‌ని డోజ్ తెలిపింది.

News November 15, 2024

‘కంగువా’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

image

సూర్య నటించిన ‘కంగువా’ వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.58.62 కోట్లు(గ్రాస్) రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు, ఎల్లుండి వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక నిన్న విడుదలైన ఈ మూవీ సినీ అభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. శివ దర్శకత్వం వహించిన కంగువాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.