News November 15, 2024

భారత ఆర్థిక వ్యవస్థ భేష్: మూడీస్

image

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మూడీస్ సంస్థ ప్రశంసించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.2 వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2025లో 6.6 శాతం, 2026లో 6.5శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. ఆర్థికంగా దేశం చక్కటి దశలో ఉందని అభిప్రాయపడింది. అయితే, ప్రపంచ రాజకీయ పరిస్థితులు, వాతావరణ ఇబ్బందులు వెరసి మాంద్యం భయాల కారణంగా RBI కఠినతరమైన విధానాల్నే కొనసాగించొచ్చని అంచనా వేసింది.

Similar News

News March 7, 2026

ఇకపై రైతుల అకౌంట్లకే సబ్సిడీ నిధులు: తుమ్మల

image

TG: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులు కొనుగోలు చేసిన పనిముట్లకు 40% సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తోంది. ఇకపై అన్నదాతల ఖాతాలకే ఆ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. APR నెలాఖరులోగా పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించాలన్నారు. ఈసారి 60.60L హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News March 7, 2026

రాజమండ్రి కల్తీ పాలు.. మిస్టరీ వీడింది

image

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం <<19223408>>ఇథిలీన్ గ్లైకాల్<<>> అనే విషపూరిత కెమికల్ పాలలో కలిసినట్లు తెలిపారు. వీటిని తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతిని పలువురు <<19320294>>మరణించినట్లు<<>> వివరించారు. కాగా గత నెలలో పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌ చెడిపోవడంతో అందులోని కూలెంట్ లీకయ్యింది. పాలు చేదుగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేసినా వ్యాపారి గణేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

News March 7, 2026

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్

image

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది. మార్చి 9 నుంచి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సెలక్షన్స్ ప్రారంభమవుతాయి. 9, 10 తేదీల్లో మహిళలకు, 12 నుంచి 16 వరకు పురుష అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత అభ్యర్థులు దీనికి అర్హులు. ఇంటర్ లేదా డిప్లొమాలో 50% మార్కులు ఉండాలి.