News December 16, 2024
భారత్లో తొలి డయాబెటిస్ బయోబ్యాంక్.. ఎక్కడంటే?

దేశంలోనే తొలి డయాబెటిస్ బయోబ్యాంక్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చెన్నైలో ఏర్పాటు చేసింది. అధునాతన శాస్త్రీయ పరిశోధనల కోసం మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో దీనిని ప్రారంభించింది. జీవ నమూనాలు సేకరించి ప్రాసెస్ చేయడం, నిల్వ, పంపిణీ చేయడం వంటివి ఈ బ్యాంక్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా శాంపిళ్లను సేకరించి ఇక్కడ పరిశోధనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 14, 2025
రెండో రౌండ్లోనూ సేమ్ సీన్

జూబ్లీహిల్స్ బైపోల్ రెండో రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లో నవీన్కు 9,691, మాగంటి సునీతకు 8,690 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
News November 14, 2025
14,967 పోస్టులకు నోటిఫికేషన్

KVS, NVSలో 14,967 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. నేటి నుంచి DEC 4వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: kvsangathan.nic.in/మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 14, 2025
13 వస్తువులతో త్వరలోనే బేబీ కిట్లు!

AP: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు త్వరలోనే ఎన్టీఆర్ బేబీ కిట్లు అందనున్నాయి. జోన్ల వారీగా వేర్వేరు సంస్థలకు కిట్ల సరఫరా బాధ్యతలు అప్పగించనున్నారు. టెండరులో 4 బిడ్లు రాగా మూడింటిని ఖరారు చేసినట్లు సమాచారం. సంవత్సరానికి 3.50 లక్షల మందికి ఈ కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కిట్లో బ్యాగు, దోమతెర, ఫోల్డబుల్ బెడ్ సహా మొత్తం 13 రకాల వస్తువులు ఉండనున్నాయి.


