News December 16, 2024

భారత్‌లో తొలి డయాబెటిస్ బయోబ్యాంక్.. ఎక్కడంటే?

image

దేశంలోనే తొలి డయాబెటిస్ బయోబ్యాంక్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చెన్నైలో ఏర్పాటు చేసింది. అధునాతన శాస్త్రీయ పరిశోధనల కోసం మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో దీనిని ప్రారంభించింది. జీవ నమూనాలు సేకరించి ప్రాసెస్ చేయడం, నిల్వ, పంపిణీ చేయడం వంటివి ఈ బ్యాంక్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా శాంపిళ్లను సేకరించి ఇక్కడ పరిశోధనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 26, 2025

రోజా.. ఐదేళ్లు రాష్ట్రానికి మీరేం చేశారు?: మంత్రి దుర్గేశ్

image

AP: Dy CM పవన్ కళ్యాణ్‌ను CM చంద్రబాబు దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి రోజాపై మంత్రి కందుల దుర్గేశ్ మండిపడ్డారు. క్యాబినెట్ మొత్తాన్ని ఎవరూ దావోస్ తీసుకెళ్లరని అన్నారు. ‘పవన్ గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఆమె ఏం చేశారు? రిషికొండపై జగన్ భవనాలు కడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాని వల్ల పర్యాటక శాఖ నష్టపోయింది’ అని విమర్శించారు.

News January 26, 2025

పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు నాలుగైనా ఇవ్వాలి కదా?: రేవంత్

image

TG: ‘పద్మ’ అవార్డుల ప్రకటనలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శించారు. ‘పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి తక్కువతో నాలుగు ఇచ్చినా రాష్ట్ర పెద్దలందరికీ గౌరవం దక్కేది. తొందర్లోనే దీనిపై ప్రధానికి లేఖ రాయబోతున్నా. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజాస్వామ్యయుతంగా తెలియజేస్తాం’ అని వెల్లడించారు.

News January 26, 2025

ఆ ప్రచారం నమ్మొద్దు.. ‘RC 16’ టీమ్

image

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ‘RC 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రెహ్మాన్ తప్పుకొన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన టీమ్ ఇందులో వాస్తవం లేదంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించింది. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.