News July 11, 2024

కోహ్లీ పాక్‌కు వస్తే ఇండియా ఆతిథ్యాన్ని మర్చిపోతారు: అఫ్రీది

image

కోహ్లీ పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడితే చూడటానికి ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది తెలిపారు. ‘విరాట్‌కు పాక్‌లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను మా దేశానికి వస్తే ఇండియాలోని ఆతిథ్యాన్ని మర్చిపోతారు. అంతగొప్పగా కోహ్లీని చూసుకుంటాం’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ రావాలని ఆ దేశం కోరుకుంటోంది. అది అసాధ్యమని BCCI వర్గాలు స్పష్టం చేశాయి.

Similar News

News February 8, 2025

9 గంటల విచారణలో ఆర్జీవీకి 41 ప్రశ్నలు

image

AP: ఒంగోలు రూరల్ PSలో డైరెక్టర్ RGVని నిన్న 9 గంటల పాటు 41 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వాటిలో 90% ఆయన సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం మళ్లీ విచారణకు రావాలని పోలీసులు చెప్పారు. అలాగే, మరో కేసులో ఆయనకు గుంటూరు CID నోటీసులిచ్చి ఈ నెల 10న విచారణకు రావాలంది. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని బి.వంశీకృ‌ష్ణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది.

News February 8, 2025

ఉదయం టిఫిన్ మానేస్తున్నారా?

image

బిజీగా ఉండటం వల్లో లేక ఇతరత్రా కారణాలతోనో చాలామంది ఉదయం అల్పాహారం మానేస్తుంటారు. అలా మానడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడం, రక్తంలో చక్కెర స్థాయుల పెరుగుదల, రోజంతా విపరీతమైన ఆకలి, భావోద్వేగాల ఊగిసలాట, రోగ నిరోధక శక్తి తగ్గుదల వంటి పలు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి మీరు తింటున్నారా? కామెంట్ చేయండి.

News February 8, 2025

తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

image

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైకోర్టులో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. వరంగల్‌లో జరిగిన బీసీ సంఘాల సభలో రెడ్డి కులస్థులపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం పోలీసుల వైఖరి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

error: Content is protected !!