News May 12, 2024

సీఎం రేవంత్ టీషర్ట్‌పై INDIA పేరు.. బీఆర్ఎస్ విమర్శలు

image

TG: సీఎం రేవంత్ ఇండియా అని రాసి ఉన్న టీషర్ట్ వేసుకుని ఫుట్‌బాల్ ఆడటంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ప్రశ్నించారు. ‘ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కు కనీసం రేవంత్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కాదు. అలాంటప్పుడు ఇండియా అనే పేరున్న టీషర్ట్ ఎందుకు వేసుకున్నారు. ప్రచార గడువు ముగిసిన ఈ సమయంలో విపక్ష కూటమి INDIAకు ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Similar News

News February 18, 2025

పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాలు

image

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. APలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేపడతారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. చివరి తేదీ: మార్చి 3. indiapostgdsonline.gov.in

News February 18, 2025

ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం: మంత్రి డీబీవీ స్వామి

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని, అవసరం అయితే కొత్త నియామకాలు చేపడతామని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై పలు సమీక్షలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన A, B, C క్యాటగిరీలుగా వారిని నియమించాలని నిర్ణయించామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేలుపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News February 18, 2025

మంచినీళ్లు వృథా చేస్తే రూ.5000 ఫైన్

image

బెంగళూరు పౌరుల నీటి వాడకంపై KA ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాగునీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్ విధించనుంది. కార్ల వాషింగ్, గార్డెనింగ్, ఫౌంటేన్లు, మాల్స్, సినిమా హాళ్లలో మంచినీరు వాడొద్దని సూచించింది. ఉల్లంఘిస్తే రూ.5000, రూల్స్ పాటించేంత వరకు రోజుకు రూ.500 అదనంగా వసూలు చేస్తామంది. MON నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలోని 14000 బోర్లలో సగం ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడింది.

error: Content is protected !!