News March 13, 2025
2100 నాటికి భారత జనాభా 153కోట్లు!

ఇండియాలో ప్రస్తుతం 140+ కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. అయితే, 2100 నాటికి ఇది 153.3 కోట్లకు చేరుతుందని UN పాపులేషన్ డివిజన్ పేర్కొంది. దీంతో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఇండియా మారనుంది. చైనాలో మాత్రం జననాల రేటు పడిపోయి అక్కడి జనాభా 77 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత నైజీరియాలో 54 కోట్లు, పాకిస్థాన్‌లో 48 కోట్లు, కాంగోలో 43కోట్లు, అమెరికా 39కోట్ల మంది జనాభాకు చేరుకుంటుందని వెల్లడించింది.
Similar News
News February 13, 2026
నేతల కుటుంబాలతో లోకేశ్ ఆత్మీయ కలయిక

AP: మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబాలతో ఉండవల్లిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, MLAలు యార్లగడ్డ, కృష్ణప్రసాద్, బుద్ధ ప్రసాద్, వర్లకుమార్, బోడే ప్రసాద్, చీఫ్ విప్ ఆంజనేయులు కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి విందు చేశారు. ఈ సందర్భంగా నేతల సతీమణులకు మంగళగిరి పట్టుచీరలు అందజేశారు.
News February 13, 2026
‘జైలర్-2’ రిలీజ్ డేట్ అదేనా?

రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘జైలర్-2’ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, శివ రాజ్ కుమార్, మోహన్‌లాల్ తదితరులు నటిస్తున్నారు. షారుఖ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
News February 13, 2026
ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.


