News October 10, 2024
భారత్ అరుదైన రికార్డ్.. 92 ఏళ్లలో ఇదే తొలిసారి
92 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా అరుదైన రికార్డు నెలకొల్పింది. బంగ్లాతో జరిగిన రెండో టీ20లో ఏడుగురు భారత బౌలర్లు వికెట్లు తీశారు. భారత్ 1932లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ ఏడుగురు వికెట్లు తీయలేదు. తాజాగా ఈ ఘనత సాధించి రికార్డు నెలకొల్పింది. కాగా ఓవరాల్‌గా టెస్టుల్లో 4 సార్లు, వన్డేల్లో 10 సార్లు, టీ20ల్లో నాలుగు సార్లు మాత్రమే ఈ ఫీట్ నమోదైంది.
Similar News
News November 4, 2024
APPSC ఛైర్మన్‌కు MLC చిరంజీవి వినతులు
AP: నిరుద్యోగులకు చెందిన పలు అభ్యర్థనలను APPSC దృష్టికి MLC వేపాడ చిరంజీవి తీసుకెళ్లారు. ‘గ్రూప్-2 మెయిన్స్ కోసం 90 రోజుల గడువు, గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం 1:100 నిష్పత్తిలో ఎంపిక, Dy.EO,JL,DL నోటిఫికేషన్లు, UPSC మాదిరిగా జాబ్ క్యాలెండర్ అమలు, AEE ఖాళీల భర్తీ, 2018 గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన విధానంపై విచారణ’ వంటి అంశాలను తాను APPSC ఛైర్మన్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
News November 4, 2024
కేంద్రంలోకి CBN.. లోకేశ్‌ను సీఎం చేసే ప్రయత్నమా?: ఎంపీ VSR
AP: జమిలి ఎన్నికలు 2027లోనే వస్తాయనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో TDP నిమగ్నమైందా? అని MP విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘అవినీతి సొమ్ము పంచుకోవడంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలతో 5 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్న చంద్రబాబు కొడుకు లోకేశ్‌ను CM చేసే ప్రయత్నంలో ఉన్నారా? చంద్రబాబు కేంద్రంలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా?’ అని Xలో రాసుకొచ్చారు.
News November 4, 2024
గుడ్‌న్యూస్.. వారికి వచ్చేనెల 2 పెన్షన్లు!
AP: ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చన్న CM చంద్రబాబు <<14507352>>ప్రకటన<<>> నేపథ్యంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇకపై ఒకనెల పింఛన్ తీసుకోకపోతే మరుసటి నెలలో 2, రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో మొత్తం కలిపి అందజేస్తారు. డిసెంబర్ నుంచే దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు. నవంబర్‌లో పింఛన్ తీసుకోనివారికి డిసెంబర్ 1న రెండు నెలలది కలిపి ఇస్తారు. NOVలో వివిధ కారణాలతో 45వేల మంది పెన్షన్ తీసుకోలేదని గుర్తించారు.