News April 9, 2025
ప్రపంచంలో అత్యంత విలువైన ఎయిర్‌లైన్ కంపెనీగా ‘ఇండిగో’

ఇండియాలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన ‘ఇండిగో’ అరుదైన ఘనత సాధించింది. మార్కెట్ క్యాపిటల్ ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ఎయిర్‌లైన్ కంపెనీగా అవతరించింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ను ఇండిగో అధిగమించింది. ఇండిగో షేర్ ప్రైస్ ఇవాళ రూ.5,265కు చేరడంతో మార్కెట్ క్యాపిటల్ 23.24 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. కాసేపటికి 23.16 బి.డా.కు తగ్గడంతో డెల్టా మళ్లీ టాప్ ప్లేసుకు వెళ్లింది.
Similar News
News April 22, 2025
రాజ్ కసిరెడ్డిని మరోసారి విచారించనున్న సిట్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని కాసేపట్లో సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. నిన్న ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటు నుంచి విజయవాడకు తరలించిన అధికారులు తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణంలో కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశముంది.
News April 22, 2025
పోప్ డెత్ రిపోర్ట్‌లో ఏముందంటే?

పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చనిపోయేముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చాలని, ఇన్‌స్క్రిప్షన్‌పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.
News April 22, 2025
BREAKING: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేశ్ బాబుకు ED నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ED సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేశ్ బాబు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది.