News November 19, 2024

దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు: భట్టి

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.

Similar News

News December 9, 2024

పుష్ప-3 వచ్చేది ఎప్పుడంటే..

image

పుష్ప-2తో అల్లు అర్జున్, సుకుమార్ ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. పుష్ప-3 ఉంటుందని ఆ సినిమా చివర్లో క్లారిటీ ఇచ్చేశారు. కానీ అదెప్పుడు అన్నదే బన్నీ ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ టాక్ ప్రకారం.. త్రివిక్రమ్‌తో కలిసి ఓ ప్రత్యేకమైన కథతో బన్నీ సినిమా చేయనున్నారు. అది పూర్తయ్యాకే పుష్ప-3 గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాల కోసం బన్నీ ఐదేళ్లు కేటాయించడం గమనార్హం.

News December 9, 2024

NIA మోస్ట్ వాంటెడ్‌.. 2,500 కి.మీ వెంటాడి పట్టుకున్నారు

image

NIAకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న కమ్రాన్ హైద‌ర్‌ను ఢిల్లీ పోలీసులు 2,500 KM వెంటాడి ప‌ట్టుకున్నారు. మాన‌వ అక్ర‌మ ర‌వాణా, ఫేక్ కాల్ సెంట‌ర్‌ల‌తో దోపిడీ కేసులో ఇతను కీల‌క నిందితుడు. ఓ క‌న్స‌ల్టెన్సీని న‌డుపుతూ థాయిలాండ్‌, లావోస్‌కు భార‌తీయుల అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డ్డాడు. కొన్ని నెలలుగా రాష్ట్రాలు మారుతూ త‌ప్పించుకు తిరుగుతున్న కమ్రాన్‌ను ఢిల్లీ స్పెష‌ల్ సెల్ పోలీసులు శ‌నివారం HYDలో అరెస్టు చేశారు.

News December 9, 2024

మీకో చట్టం.. ప్రతిపక్షానికి మరో చట్టమా?: అంబటి

image

AP: రాష్ట్రంలో అధికార పక్షానికి ఓ చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టం అమలవుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని YCP నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మాజీ CM జగన్, ఆయన సతీమణి, మాజీ మంత్రులపై టీడీపీ వాళ్లు పోస్టులు పెడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు తమ ఫిర్యాదులకు స్పందించడం లేదని, ప్రజలు గమనించాలని కోరారు.