News November 17, 2024

మిడ్ మానేరు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4696 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో మొత్తం 10683 కుటుంబాలు నిర్వాసితులు కాగా ఇప్పటికే 5987 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. మిగిలిన వారికి తాజాగా ఇళ్లు మంజూరు చేశారు.

Similar News

News December 4, 2024

అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్‌లో భారత సంస్థ!

image

ప్రపంచ ఎయిర్‌లైన్స్‌లో ఈ ఏడాది అత్యుత్తమైనవి, చెత్తవాటితో కూడిన జాబితాను ఎయిర్‌హెల్ప్ సంస్థ రూపొందించింది. సమయపాలన, ప్రయాణికుల సంతృప్తి తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అత్యంత చెత్త ఎయిర్‌లైన్‌గా 109వ స్థానంలో టునీస్‌ఎయిర్ నిలవగా 103వ స్థానంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో ఉంది. అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్, ఖతర్ ఎయిర్‌వేస్ తొలి 2 స్థానాలు దక్కించుకున్నాయి.

News December 4, 2024

KCRకు రేవంత్ రెడ్డి సవాల్

image

KCR రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘మేం కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో చూడ్డానికి రా. లెక్కలు తేలుద్దాం’ అని సవాల్ విసిరారు. కాళేశ్వరం నుంచి చుక్కనీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని సీఎం తెలిపారు.

News December 4, 2024

ఆ రోజు సెలవు ఇవ్వాలని వినతి

image

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కమిటీ కోరింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అటు రాష్ట్ర కాంగ్రెస్ గిరిజన నేతలు కూడా కేంద్రాన్ని ఇదే విషయమై డిమాండ్ చేశారు. కాగా గతేడాది ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలీడే ఇచ్చిన విషయం తెలిసిందే.