News February 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. నిబంధనలు ఇవే..

image

TG: సర్వే సమయంలో స్థలం చూపిన చోటే నిర్మించాలి. ముగ్గు పోసుకున్నాక గ్రామ కార్యదర్శికి చెబితే ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. 400 చ.అ. కంటే తక్కువగా నిర్మాణం చేపట్టొద్దు. పునాది పూర్తయ్యాక తొలిదశలో రూ.లక్ష జమ చేస్తారు. 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇచ్చి, హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్, స్టీలు తక్కువ ధరకు అందేలా చూస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశను బట్టి AE/MPDOలు నగదు జమకు సిఫార్సు చేస్తారు.

Similar News

News November 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 71 సమాధానాలు

image

ప్రశ్న: గణేశుడు భారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
జవాబు: వినాయకుడు భార‌తం రాసేట‌ప్పుడు ఈకలు ప్రతిసారి విరిగిపోయాయి. రచనను మ‌ధ్య‌లో ఆగిపోకూడ‌ద‌నే ష‌ర‌తుకు క‌ట్టుబ‌డిన గ‌ణేషుడు ఈకలతో పని కాదని గ్రహించి త‌న దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాయ‌డం పూర్తిచేశాడు. మ‌రో క‌థనం ప్ర‌కారం.. ప‌ర‌శురాముణ్ని నిరోధించ‌డంతో రెండు దంతాల్లో ఒక దాన్ని విరిచేస్తాడ‌ని చెబుతారు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 19, 2025

ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారు: మాన్య

image

హీరో ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారని తమిళ నటి మాన్య ఆనంద్ ఆరోపించారు. ధనుష్ నిర్మించే సినిమాలో నటించేందుకు శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడన్నారు. ధనుష్ కోసమంటూ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాడన్నారు. స్క్రిప్ట్, ప్రొడక్షన్ హౌస్ లొకేషన్ పంపగా నంబర్‌ను బ్లాక్ చేశానని చెప్పారు. దీనిపై ధనుష్ టీమ్ స్పందిస్తూ మేనేజర్ పేరిట ఎవరో అమ్మాయిల్నిబ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.

News November 19, 2025

రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.