News March 3, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. 15లోగా అకౌంట్లలోకి డబ్బులు

image

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలుపెట్టనున్నారు. బేస్‌మెంట్ పూర్తిచేసిన వారి అకౌంట్లలో ఈ నెల 15నాటికి రూ.లక్ష చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.715 కోట్లు సిద్ధం చేస్తోంది. వారికి దశలవారీగా రూ.5లక్షలు ఇవ్వనున్న విషయం <<15529635>>తెలిసిందే.<<>>

Similar News

News October 23, 2025

మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

image

TG: వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరిగే <<17462157>>మేడారం<<>> జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే ప్రదేశాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించనున్నట్లు అధికారులు తెలిపారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. 12 వేల మంది పోలీసులు జాతరలో విధులు నిర్వహిస్తారని సమాచారం.

News October 23, 2025

ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు: అనిత

image

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున సహాయక బృందాలను సిద్ధంగా ఉంచామని హోంమంత్రి అనిత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు వివరించారు. నెల్లూరు, PKS, KDP, TPT జిల్లాల్లో NDRF, SDRF బృందాలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

News October 23, 2025

మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్

image

TG: గోరక్షాదళ్ సభ్యుడు సోనూసింగ్‌పై <<18077269>>దాడిని<<>> కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఎంఐఎం రౌడీలకు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ధ్వజమెత్తారు. గోభక్తులపై దాడులకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తెలిపారు.