News March 3, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. 15లోగా అకౌంట్లలోకి డబ్బులు

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు మొదలుపెట్టనున్నారు. బేస్‌మెంట్ పూర్తిచేసిన వారి అకౌంట్లలో ఈ నెల 15నాటికి రూ.లక్ష చొప్పున జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.715 కోట్లు సిద్ధం చేస్తోంది. వారికి దశలవారీగా రూ.5లక్షలు ఇవ్వనున్న విషయం <<15529635>>తెలిసిందే.<<>>
Similar News
News March 19, 2025
పాకిస్థాన్‌లో చైనా ఆర్మీ..!

పాకిస్థాన్‌లో ఆర్మీ, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించేలా చైనా ఒప్పందం చేసుకుంది. సీపెక్ ప్రాజెక్టులోని చైనా కార్మికులని, ఇంజినీర్లను కాపాడేందుకు వీలుగా ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో డ్రాగన్ దేశానికి చెందిన పలు భద్రతా ఏజెన్సీలు పాక్‌లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తాయి. పాక్‌లో బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News March 19, 2025
ఐదేళ్లలో రైలు టికెట్ ధరలు పెంచలేదు: కేంద్ర మంత్రి

దేశంలో గత ఐదేళ్లలో రైలు ఛార్జీలు పెంచలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ LSలో వెల్లడించారు. పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే మన దేశంలోనే టికెట్ ధరలు తక్కువని చెప్పారు. 350 కి.మీ దూరానికి మన దేశంలో ఛార్జ్ రూ.121గా ఉంటే, పాకిస్థాన్‌లో రూ.436, బంగ్లాలో రూ.323, శ్రీలంకలో రూ.413 అని వివరించారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంతో పోల్చితే ఇప్పుడు 90% రైలు ప్రమాదాలు తగ్గాయన్నారు.
News March 19, 2025
రోదసిలో అధిక కాలం ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలివే

గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. తద్వారా కండరాలు, ఎముకలలో క్షీణత మెుదలవుతుంది. భార రహిత స్థితి వల్ల చెవిలోని వెస్టిబ్యులర్ అవయవానికి అందే సమాచారం మారిపోతుంది దీంతో మెదడు సరిగ్గా పనిచేయదు. శరీరంలోని పైభాగంలో, తలలో రక్తం పేరుకుపోతోంది. తెల్ల రక్తకణాలు తగ్గే ప్రమాదముండటంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అధిక రేడియో ధార్మికత వల్ల దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవ్వచ్చు.